నీతిఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ విడుదల
Sakshi Education
భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సూచీ-2019 నివేదికను నీతిఆయోగ్ డిసెంబర్ 30న న్యూఢిల్లీలో విడుదల చేసింది.
ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. తొలిసారిగా 2018లో ఈ సూచీని రూపొందించిన నీతిఆయోగ్.. ఈ సూచీ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది.
నాలుగు కేటగిరిలుగా...
2011 జనగణనను, నాలుగైదేళ్ల క్రితం నుంచి 2019 వరకు గల గణాంకాలను ఆధారంగా దాదాపు 62 అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 లక్ష్యాలకు స్కోరు కేటాయించారు. కేంద్ర గణాంకాలు, పథక అమలు శాఖ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి సహకారంతో నీతిఆయోగ్ ఈ సూచిని రూపొందించింది. వివిధ స్కోర్ల ఆధారంగా 4 కేటగిరీలుగా రాష్ట్రాలను విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్), 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు (పర్‌ఫార్మర్), 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస (ఫ్రంట్ రన్నర్)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు (అచీవర్)గా విభజించింది.
ఫ్రంట్ రన్నర్‌లో...
2018లో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఫ్రంట్న్న్రర్‌లో నిలిచాయి. 2019 సూచీలో 8 రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చోటు సాధించాయి. వీటిలో తెలంగాణతో పాటు కర్ణాటక, సిక్కిం, గోవా కూడా ఉన్నాయి. కేరళ (70) మొదటిస్థానంలో, హిమాచల్ ప్రదేశ్ (60) రెండోస్థానంలో నిలిచింది.
ఎస్‌డీజీ సూచీ-2019 ముఖ్యాంశాలు

- ఎస్‌డీజీ సూచీలో కేరళ ప్రథమ స్థానాన్ని, హిమాచల్ రెండో స్థానాన్ని పొందాయి. తమిళనాడుతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు మూడో స్థానంలో నిలిచాయి.
- లక్ష్య సాధనలో కేరళకు 70 మార్కులు, హిమాచల్‌కు 69, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు 67 మార్కుల వంతున వచ్చాయి.
- బిహార్, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లు అట్టడుగున నిలిచాయి.
- ఈ ఏడాది దేశ సగటు స్కోరు 60గా ఉంది. 2018లో ఈ స్కోరు 57గా ఉంది.
- స్వచ్ఛమైన నీరు-పారిశుద్ధ్యం అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. 100కుగానూ 96 పాయింట్లు సాధించింది.
- తగిన ఉపాధి-ఆర్థిక వృద్ధి అంశంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు 82 పాయింట్లు వచ్చాయి. 78 పాయింట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు రెండో స్థానాన్ని పొందాయి. నికర జాతీయ ఉత్పత్తి (ఎన్‌డీపీ) వృద్ధి తెలంగాణలో 8.89 శాతంగా, ఆంధ్రప్రదేశ్‌లో 10.07 శాతంగా నమోదయింది.
- సాంఘిక అసమానతల తొలగింపులో తెలంగాణ 94 పాయింట్ల స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ 68 పాయింట్లతో 12వ ర్యాంకులో నిలిచింది.
- పేదరిక నిర్మూలనలో 72 స్కోర్‌తో తమిళనాడు నంబర్‌వన్‌గా నిలవగా, 52 స్కోరుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది.
- మంచి ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సులో 82 స్కోరుతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 66 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది.
- నాణ్యమైన విద్యలో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తొలి 2 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 9వ ర్యాంకు సాధించింది.
- ఆకలి తీర్చే అంశంలో తెలంగాణ 36 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. గోవా (76), మిజోరం (75), కేరళ (74) తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
Published date : 31 Dec 2019 05:37PM