నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అధ్యక్షుడు?
Sakshi Education
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) తాత్కాలిక అధ్యక్షుడిగా జస్టిస్ బీఎస్‌వీ ప్రకాశ్ కుమార్ కొనసాగనున్నారు.
ఈ మేరకు డిసెంబర్ 9న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీఎల్‌టీకి నూతన అధ్యక్షుడిని నియమించే వరకు జస్టిస్ ప్రకాశ్ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ అనంతరం తాజా ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది. జస్టిస్ ప్రకాశ్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందినవారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగింపు
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : జస్టిస్ బీఎస్‌వీ ప్రకాశ్ కుమార్
ఎందుకు : ఎన్‌సీఎల్‌టీకి నూతన అధ్యక్షుడిని ఇంకా నియమించనందున
Published date : 10 Dec 2020 07:21PM