నాడా పరిధిలోకి బీసీసీఐ
Sakshi Education
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేందకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంగీకరించిందని జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా ఆగస్టు 9న తెలిపారు.
దీంతో బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)గా గుర్తింపు లభించింది. బీసీసీఐను ఎన్‌ఎస్‌ఎఫ్‌గా ప్రభుత్వం గుర్తించడంతో డోపింగ్ విషయంలో నాడా నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్‌ను స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కు బీసీసీఐ పంపేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా నాడానే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు నాడా పరీక్షలు నిర్వహించవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి బీసీసీఐ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి బీసీసీఐ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝులనియా
Published date : 10 Aug 2019 06:41PM