మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్
Sakshi Education
భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించిన డా. దంతు మురళీకృష్ణకు విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019 లభించింది.
న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఆగస్టు 16న జరిగిన కార్యక్రమంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌సిన్హా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. భగవద్గీతపై సంభవామి యుగే యుగే శీర్షికతో సంస్కతం-హిందీ, సంస్కృతం-తెలుగుల్లో ఆడియో ఆల్బంను, పుస్తకాన్ని మురళీకృష్ణ తీర్చిదిద్దారు. ఇలా చేసిన తొలి శాస్త్రవేత్తగా ఆయన నిలిచారు.
వృత్తి రీత్యా సైంటిస్టు అయిన మురళీకృష్ణ లుపిన్ లిమిటెడ్‌లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం రాజమండ్రి కాగా, భోపాల్‌లో నివాసం ఉంటున్నారు. భగవద్గీతపై విశేష కృషి చేసినందుకు గానూ రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్ ఆయనకు లక్ష రూపాయలు నగదుతో విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్‌ను అందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశిష్ట సంస్కృత సేవా సమ్మాన్ అవార్డు-2019
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : డా. దంతు మురళీకృష్ణ
ఎందుకు : భగవద్గీతపై ఆడియో ఆల్బం, పుస్తకం రూపొందించినందుకు

Published date : 17 Aug 2019 04:54PM