ముల్కనూరు పీఏసీఎస్‌కు జాతీయ స్థాయి అవార్డు
Sakshi Education
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రాథమిక సహకార పరపతి సంఘానికి (పీఏసీఎస్) జాతీయ స్థాయి అవార్డు లభించింది.
వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్న వారి కోసం ఉద్దేశించిన ‘ఔట్‌లుక్ అగ్రికల్చర్ కాన్‌క్లేవ్ అండ్ స్వరాజ్ అవార్డ్స్-2020’లో ఉత్తమ రైతు సహకార సంఘం అవార్డును సాధించింది. ఢిల్లీలో ఫిబ్రవరి 24న జరిగిన ఓ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఎ.ప్రవీణ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, హరియాణా, మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రులు జయప్రకాశ్ దలాల్, సచిన్‌యాదవ్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ రైతు సహకార సంఘం అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ముల్కనూరు పీఏసీఎస్
ఎందుకు : వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్నందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ రైతు సహకార సంఘం అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ముల్కనూరు పీఏసీఎస్
ఎందుకు : వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి సాధిస్తున్నందున
Published date : 25 Feb 2020 06:13PM