మోదీ అధ్యక్షతన గంగా మండలి తొలి భేటీ
Sakshi Education
నమామి గంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి మొదటి భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిసెంబర్ 14న ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గంగా నది శుద్ధీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యక్ష తార్కాణంగా నిలవాలని ఆకాంక్షించారు. భేటీ అనంతరం మోదీ అరగంట పాటు గంగానదిలో బోటు షికారుకు వెళ్లారు. నదీ జలాలను రక్షించేందుకు అది ప్రవహిస్తున్న రాష్ట్రాలకు 2015-20 వరకు రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని సంబంధిత వ్యవహారాల అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ గంగా మండలి తొలి భేటీ
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎక్కడ : చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ గంగా మండలి తొలి భేటీ
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎక్కడ : చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
Published date : 16 Dec 2019 05:46PM