Skip to main content

మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 18 శాతానికి పెంపు

మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
  • Enewsకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో మార్చి 14న జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ మేరకు అంగీకరించింది. వినియోగదారుల సమస్యలను అధిగమించేలా జీఎస్టీ నెట్‌వర్క్ డిజైన్ మెరుగుపరిచే బాధ్యతను ఇన్ఫోసిస్‌కు అప్పగించాలని నిర్ణయించింది.
     
     కౌన్సిల్ సమావేశం-ముఖ్యాంశాలు 
  • మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక విడిభాగాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. ఇది 2020, ఏప్రిల్ 1నుంచి అమలవనుంది.
  • విమానాల మెయింటెనెన్‌‌స అండ్ రిపైర్, ఓవర్‌హౌల్(ఎంఆర్‌వో)సేవలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
  • 2018-19 సంవత్సరంలో రూ.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి వ్యాపార సంస్థలకు జీఎస్‌టీఆర్-9సీ దాఖలు చేయనవసరం లేకుండా మినహాయింపునిచ్చింది.
  • జీఎస్టీ కింద రిజిస్టరయిన ప్రతి వ్యక్తి తన వ్యాపారానికి అనుగుణంగా సరఫరాదారుల ప్రాథమిక సమాచారం తెలుసునేందుకు వీలుగా త్వరలో ‘నో యువర్ సప్లయర్’ పేరుతో కొత్త సౌకర్యం.
  • జీఎస్టీ నెట్‌వర్క్ కొత్త వ్యవస్థ 2021 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.

     క్విక్ రివ్యూ   :
     ఏమిటి :
    మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 18 శాతానికి పెంపు
     ఎప్పుడు  : మార్చి 14
     ఎవరు  : 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
Published date : 16 Mar 2020 06:25PM

Photo Stories