Skip to main content

మలయాళం న్యూస్ చానెళ్లపై నిషేధం ఎత్తివేత

ఢిల్లీలో చెలరేగిన హింసపై ఏకపక్ష వార్తలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై రెండు మలయాళం వార్తా చానళ్లు ఏసియానెట్ న్యూస్, మీడియా వన్‌లపై మార్చి 6న విధించిన 48 గంటల నిషేధాన్ని కేంద్రప్రభుత్వం ఎత్తివేసింది.
Current Affairs ఫిబ్రవరి 25న ప్రసారం చేసిన వార్తలకు అదే నెల 28న కేంద్రం షోకాజ్ నోటీసులు జారీచేసింది. చానళ్లు ఇచ్చిన సమాధానంతో సంతృప్తిపడని కేంద్రం మార్చి 6న నుంచి 8 వరకు నిషేధాన్ని విధించింది.

ఢిల్లీలో లేపాక్షి హస్తకళల కేంద్రం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మార్చి 7న ‘లేపాక్షి హస్తకళల విక్రయ కేంద్రం’ను ఆయన ప్రారంభించారు.
Published date : 10 Mar 2020 07:00PM

Photo Stories