మలేషియా ప్రధాని మహతీర్ రాజీనామా
Sakshi Education
మలేసియా ప్రధానమంత్రి మహతీర్ మొహమాద్ ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని మలేసియా ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో 94 ఏళ్ల మహతిర్ తన పదవికి రాజీనామా చేశారు. 2018, మే 10న మలేసియా ప్రధానిగా మహతీర్ రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేసియా ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : మహతీర్ మొహమాద్
ఎందుకు : ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేసియా ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : మహతీర్ మొహమాద్
ఎందుకు : ప్రభుత్వాన్ని గద్దె దించాలని అధికారంలో భాగస్వామ్య పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో
Published date : 24 Feb 2020 06:09PM