Skip to main content

మలేరియా కారక సూక్ష్మజీవిపై కొత్త పద్ధతి ఆవిష్కణ

మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు.
Current Affairsమలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్‌ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్‌సింగ్ సిజ్‌వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్-రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్‌ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోరుు అక్కడ ఉన్న డీఎన్‌ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది. క్విక్ రివ్యూ: ఏమిటి: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఎక్కడ: హైదరాబాద్‌ఎందుకు: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు
Published date : 16 Jan 2020 04:41PM

Photo Stories