Skip to main content

మిగ్-27 యుద్ధ విమానాలకు వీడ్కోలు

భారత వాయుసేనలో ‘బహదూర్’గా పేరు పొందిన అతి శక్తిమంతమైన మిగ్(ఎంఐజీ)-27 యుద్ధ విమానాలకు భారత వాయుసేన(ఐఏఎఫ్) డిసెంబర్ 27న ఘన వీడ్కోలు పలికింది.
Current Affairsరాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్-27 విమానాలు చివరిసారి గగనతలంలో విహరించాయి. అనంతరం నేలకు దిగిన ఈ విమానాలకు వాటర్ కేనన్ ద్వారా నీళ్లు చిమ్మి గౌరవ వందనం సమర్పించారు. మిగ్ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్‌కే ఘోటియా పాల్గొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ విమానాలు సేవలందించాయి.

1999 నాటి కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన ఈ విమానాలను భారత వైమానిక దళంలో బహదూర్‌గా పిలుస్తారు. ఈ వీడ్కోలుతో ప్రపంచవ్యా ప్తంగా ఈ మిగ్-27 విమానాల ప్రస్థానానికి ముగింపు పడింది. ప్రస్తుతం ఏ దేశంలోనూ వినియోగంలో లేవు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మిగ్-27 యుద్ధ విమానాలకు వీడ్కోలు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : భారత వాయుసేన(ఐఏఎఫ్)
ఎక్కడ : జోధ్‌పూర్ వైమానిక స్థావరం, రాజస్థాన్
Published date : 28 Dec 2019 06:07PM

Photo Stories