మహిళల స్టార్ స్ప్రింటర్ విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పింది ఎవరు?
Sakshi Education
మహిళల 100 మీటర్ల విభాగంలో ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కూడా కొత్త జాతీయ రికార్డు సృష్టించింది.
ఆమె 11.17 సెకన్లలో రేసును ముగించి 11.21 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. 100 మీటర్ల రిలేలో ద్యుతీ చంద్, హిమా దాస్, ధనలక్ష్మి, అర్చనలతో కూడిన భారత ‘ఎ’ జట్టు 43.37 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 43.42 సెకన్ల తో 2016లో మెర్లిన్, జ్యోతి, శ్రావణి ద్యుతీ బృందం చేసిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: మహిళల స్టార్ స్ప్రింటర్ విభాగంలో జాతీయ రికార్డు
ఎప్పుడు: జూన్ 21
ఎవరు: ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్
ఎక్కడ: ఇండియన్ గ్రాండ్‌ఫ్రీ–4 అథ్లెటిక్స్ మీట్, పాటియాలాక్విక్ రివ్యూ :
ఏమిటి: మహిళల స్టార్ స్ప్రింటర్ విభాగంలో జాతీయ రికార్డు
ఎప్పుడు: జూన్ 21
ఎవరు: ఒడిశా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్
Published date : 22 Jun 2021 04:50PM