మహిళల ఎమర్జింగ్ కప్ విజేతగా భారత్
Sakshi Education
ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో అక్టోబర్ 29న శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వంలోని టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. భారత ఇన్నింగ్‌స తర్వాత వర్షం రావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో శ్రీలంక లక్ష్యాన్ని 35 ఓవర్లలో 150 పరుగులుగా సవరించారు. శ్రీలంక 34.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత మహిళల జట్టు
ఎక్కడ : కొలంబో, శ్రీలంక
Published date : 30 Oct 2019 05:34PM