మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో నూతన ప్రపంచ రికార్డు
Sakshi Education
మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో నూతన ప్రపంచ రికార్డు నమోదైంది.
టోక్యో ఒలింపిక్స్–2020లో భాగంగా 2021, ఆగస్టు 4న జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో అమెరికా అథ్లెట్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్ అందరికంటే ముందుగా 51.46 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆమె... 2021, జూన్‌లో జరిగిన యూఎస్ ఒలింపిక్స్ ట్రయిల్స్‌లో 51.90 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాకుండా జమైకన్ అథ్లెట్ మెలైనె వాకర్ పేరిట ఉన్న ఒలింపిక్ రికార్డును (52.64 సెకన్లు; 2008 బీజింగ్ ఒలింపిక్స్) 21 ఏళ్ల మెక్‌లాఫ్లిన్ తన పేరిట బదిలీ చేసుకుంది. దాలియా మొహమ్మద్ (అమెరికా; 51.58 సెకన్లు) రజతం... ఫెమ్‌కే బోల్ (నెదర్లాండ్స్; 52.03 సెకన్లు) కాంస్యం గెలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో నూతన ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఆగస్టు 4, 2021
ఎవరు : అమెరికా అథ్లెట్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్
ఎక్కడ : టోక్యో, ఒలింపిక్స్
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2020 మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో 51.46 సెకన్లలో రేసును పూర్తి చేసినందుకు...

Published date : 05 Aug 2021 06:05PM