మహిళా పోలీసులతో పరేడ్ నిర్వహించిన తొలి రాష్ట్రం?
Sakshi Education
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, హిమాచల్ ప్రదేశ్ పోలీసు శాఖ మార్చి 8న మహిళా పోలీసులతో పరేడ్ నిర్వహించింది.
పరేడ్‌లో భాగంగా మహిళా పోలీసులు మోటారుబైక్‌లతో విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... అచ్చంగా మహిళా పోలీసులతో పరేడ్ నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారి అని, ఇతర రాష్ట్రాలన్నింటికీ ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం ‘వీరాంగన’సావనీర్‌ని గవర్నర్ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళా పోలీసులతో పరేడ్ నిర్వహించిన తొలి రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : హిమాచల్ ప్రదేశ్
ఎక్కడ : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
Published date : 09 Mar 2021 07:21PM