మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ మంత్రి?
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
ఆమెతో పాటు కమిషన్ సభ్యులుగా షాహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరి బాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధాలక్ష్మి, కటారి రేవతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్ డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం... కమిషన్ చైర్మన్‌తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యత లు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్లు పదవిలో ఉంటారు.
రెండేళ్లుగా...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా త్రిపురాన వెంకట రత్నం పనిచేశారు. రాష్ట్ర వి భజన నేపథ్యంలో 2018 మార్చి వరకు ఆమె కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్ నియామకం జరగలేదు. దీంతో సుమారు రెండేళ్లుగా కమిషన్ క్రియాశీల కార్యకలాపాలకు దూరంగా ఉంది.
సునీతా లక్ష్మారెడ్డి...
- మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
- ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చిన్న నీటి పారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు.
- రాష్ట్ర విభ జన తర్వాత 2014, 2018లో నర్సాపూర్ శాసన సభ స్థానం నుంచి, 2015లో మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
- 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
Published date : 28 Dec 2020 05:57PM