Skip to main content

మహా వీరచక్ర, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ వేణుగోపాల్‌ కన్నుమూత

1971లో భారత్‌–పాక్‌ యుద్ధంలో విశేష సేవలందించిన మహా వీరచక్ర, పరమ విశిష్ట సేవా మెడల్‌ గ్రహీత, యుద్ధ వీరుడు రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌(93)ను కన్నుమూశారు.
Current Affairs
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 27న తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వేణుగోపాల్‌ కోరిక మేరకు ఆయన పార్థివదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. 1927, నవంబర్ 14న జన్మించిన వేణుగోపాల్.. ఆర్మీలో హవల్దార్ గా చేరారు. అనంతరంకఠోర శిక్షణ పొందిగుర్కారైఫిల్‌లో చేరి లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు ఎదిగారు.బంగ్లాదేశ్‌ విమోచనకు 1971లో జరిగిన ఇండో- పాక్‌ యుద్ధంలో ఆయన బెటాలియన్‌ నాయకుడిగా ప్రధాన భూమిక పోషించారు. 36 ఏళ్లు సైన్యంలో పనిచేసిన వేణుగోపాల్‌ 1984లో మేజర్ జనరల్ హోదా పదవీ విరమణ చేశారు. 1972లో మహావీర చక్ర, 1980లో పరమ విశిష్ట సేవా మెడల్‌ అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మహా వీరచక్ర, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : సి.వేణుగోపాల్‌(93)
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు :అనారోగ్య సమస్యల కారణంగా...
Published date : 29 Apr 2021 06:12PM

Photo Stories