Skip to main content

మద్రాసు ఐఐటీతో ఎన్నికల కమిషన్ ఒప్పందం

దేశంలో ఎక్కడినుంచైనా ఓటు వేయటానికి వీలు కల్పించే బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు భారత ఎన్నికల కమిషన్, మద్రాసు ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Current Affairsప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో ఉందని ఎన్నికల కమిషన అధికారులు తెలిపారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్దిష్ట ప్రదేశానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఉదాహరణకు చెన్నైకి చెందిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే అధికారులు ఏర్పాటు చేసిన అధీకృత సెంటర్ ద్వారా చైన్నైలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. దీనికి ఈ-బాలెట్ పేపర్ జనరేట్ అవుతుంది’ అని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
మద్రాసు ఐఐటీతో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత ఎన్నికల కమిషన్
ఎందుకు : బ్లాక్‌చైన్ టెక్నాలజీపై కలసి పని చేసేందుకు
Published date : 17 Feb 2020 06:00PM

Photo Stories