మానవత్వమే నా మతం అనే పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ?
Sakshi Education
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు 2017, నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ చేపట్టారు.
ఈ యాత్ర చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా గాంధీ పథం పక్షపత్రిక ‘మానవత్వమే నా మతం’ అన్న పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో 2020, నవంబర్ 6న ఆవిష్కరించారు. 3,648 కి.మీల ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా నాడు వైఎస్ జగన్ దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన పలు మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ ఈ ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించారు.
ప్రజాశక్తి భవనం ప్రారంభం...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ భవనాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 6న ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మానవత్వమే నా మతం అనే పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ?
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : గాంధీ పథం పక్షపత్రిక
ఎందుకు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా...

Published date : 07 Nov 2020 06:07PM