మాల్దీవుల పార్లమెంటులో మోదీ ప్రసంగం
Sakshi Education
మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్‌ను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూన్ 8న ప్రసంగించారు.
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారిందని, దీనిపై పోరాటం సాగించేందుకు అందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా మోదీ ప్రపంచనేతలకు పిలుపునిచ్చారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మోదీ ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’అన్న ప్రభుత్వ విధానంలో భాగంగా మొట్టమొదటి పర్యటన మాల్దీవులతో ప్రారంభించారు.
మోదీకి రూల్ ఆఫ్ నిషాన్...
మోదీ పర్యటన సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ ఆయనకు విదేశీ ప్రముఖులకిచ్చే అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్‌తో గౌరవించారు. మోదీ భారత క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలతో కూడిన క్రికెట్ బ్యాట్‌ను సోలిహ్‌కి బహూకరించారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు క్రికెట్ దోహదపడుతుందని, మాల్దీవుల్లో క్రికెట్ అభివృద్ధికి సాయపడతామని మోదీ తెలిపారు.
మాల్దీవుల అధ్యక్షుడు సోలిహ్‌తో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించడం వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కలిసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాలని ఇద్దరు నేతల ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్‌ను ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Published date : 10 Jun 2019 06:13PM