మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఎండీపీ విజయం
Sakshi Education
మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్)కు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ నేతృత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) విజయం సాధించింది.
మొత్తం 87 స్థానాలకు ఎన్నికలు జరగగా 60 చోట్ల ఎండీపీ విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ పార్టీ పరాజయం పాలైంది. యమీన్ పార్టీ నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ)
Published date : 08 Apr 2019 05:03PM