Skip to main content

లోక్‌స‌భ ఆమోదించిన నేషనల్ కమిషన్ హెల్త్‌కేర్ బిల్లు ఉద్దేశం?

ఆరోగ్య సంరక్షణ, దాని అనుబంధ రంగాల్లో వృత్తి నిపుణులందరికీ ఒకే తరహా విద్యా ప్రమాణాలు బోధించేలా ఒక జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిన ‘‘ది నేషనల్ కమిషన్ ఫర్ అలియడ్ అండ్ హెల్త్‌కేర్ ఫ్రొఫెషన్స్ బిల్లు, 2021’’కి లోక్‌స‌భ ఆమోద ముద్ర వేసింది.
Current Affairs
మూజువాణి ఓటుతో మార్చి 24న బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుని ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే.

బిహార్‌ డిప్యూటీ స్పీకర్‌గా మహేశ్వర్‌...
బిహార్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా జేడీ(యూ) సీనియర్‌ నాయకుడు మహేశ్వర్‌ హజారి ఎన్నికయ్యారు. విపక్ష సభ్యులు మార్చి 24న సభను బహిష్కరించడంతో అధికారపక్షం మూజువాణి ఓటుతో హజారి ఎన్నికను ఖరారు చేసింది.

బిహార్‌ రాష్ట్రం....
రాజధాని: పాట్నా
శాసనసభ సీట్లు: 243
శాసనమండలి: 95
లోక్‌సభ సీట్లు: 40 (జనరల్‌–34, ఎస్సీ–6, ఎస్టీ–0)
రాజ్యసభ సీట్లు: 16
హైకోర్టు: పాట్నా హైకోర్టు
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి, మైథిలీ
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
ప్రస్తుత గవర్నర్‌: ఫగు చౌహాన్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: నితీశ్‌ కుమార్‌

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ది నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలియడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఫ్రొఫెషన్స్‌ బిల్లు, 2021కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ఆరోగ్య సంరక్షణ, దాని అనుబంధ రంగాల్లో వృత్తి నిపుణులందరికీ ఒకే తరహా విద్యా ప్రమాణాలు బోధించేలా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం కోసం...
Published date : 26 Mar 2021 05:33PM

Photo Stories