లంక ఎన్నికల్లో రాజపక్స విజయం
Sakshi Education
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స (70) విజయం సాధించారు.
తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘేపై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లంకకు ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గొటబాయ ఆ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగనున్నారు. లంకలోని ప్రాచీన నగరం అనురాధపురంలో ఆయన నవంబర్ 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజపక్స కుటుంబం నుంచి 2005-15 మధ్య మహింద రాజపక్స అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తమ్ముడే ఇప్పుడీ ఎన్నికల్లో గెలుపొందిన గొటబాయ. వివాదాస్పదుడిగానూ, ఎల్‌టీటీఈ తీవ్రవాదులను అణచివేసిన మిలిటరీ వార్ హీరోగానూ గొటబాయకు పేరుంది.
నమ్మకాన్ని నిలబెడతా: గొటబాయ
నవంబర్ 17న వెలువడిన ఫలితాల్లో గొటబాయ 52.25 శాతం ఓట్లను (6,924,255) సాధించగా, ఆయన ప్రత్యర్థి ప్రేమదాస 41.99 శాతం ఓట్లను (5,564,239) సాధించారని ఎన్నికల కమిషన్ చైర్మన్ మహింద దేశప్రియ చెప్పారు. విజయం ఖరారు కాగానే గొటబాయ రాజపక్స.. ‘శ్రీలంక కోసం చేసే కొత్త ప్రయాణంలో దేశ ప్రజలూ భాగస్తులే. ఎన్నికల ప్రచారంలో మెలిగినట్లే శాంతియుతంగా సంబరాలు చేసుకుందాం. నన్ను ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటాను. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రధాన మంత్రిగా మాజీ అధ్యక్షుడు, గొటబాయ సోదరుడు మహింద రాజపక్స నియమితులు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లంక ఎన్నికల్లో రాజపక్స విజయం
ఎప్పుడు: నవంబర్ 17, 2019
ఎవరు: గొటబాయ రాజపక్స
ఎక్కడ: శ్రీలంక

Published date : 18 Nov 2019 05:33PM