లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
Sakshi Education
టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను 2021 ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు.
ఫెడరర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. 2020 ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో 2020 లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ 2021 ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
Published date : 18 Apr 2020 06:16PM