లెబనాన్ ప్రధాని సాద్ హరిరి రాజీనామా
Sakshi Education
లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి తన పదవికి రాజీనామా అక్టోబర్ 29న రాజీనామా చేశారు.
లెబనాన్ దేశాన్ని ఆర్థికాభివృద్ధి చేసి పరిరక్షించేందుకు నా సహచరులు బాధ్యత తీసుకోవాలి... నేను రాజకీయంగా చివరి దశకు చేరుకున్నానని ఈ సందర్భంగా సాద్ వ్యాఖ్యానించారు. వాట్సాప్ కాల్స్‌పై పన్ను విధింపు తదితర పొదుపు చర్యలను సాద్ సర్కారు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా దాదాపు రెండువారాలుగా భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాద్ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : సాద్ హరిరి
ఎందుకు : సాద్ సర్కారు నిర్ణయాలపై ప్రజలు తీవ్ర నిరసన ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో
Published date : 30 Oct 2019 05:41PM