ఖతర్ ఓపెన్ టోర్ని విజేతగా బోపన్న జంట
Sakshi Education
ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం విజేతగా నిలిచింది.
ఖతర్ రాజధాని దోహాలో జనవరి 10న జరిగిన డబుల్స్ ఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 3-6, 6-2, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో ల్యూక్ బామ్‌బ్రిడ్‌జ (ఇంగ్లండ్)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్ని డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)
ఎక్కడ : దోహా, ఖతర్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్ని డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)
ఎక్కడ : దోహా, ఖతర్
మాదిరి ప్రశ్నలు
1. ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్ ఏ నగరంలో జరగనుంది?
1. కోల్‌కతా
2. ముంబై
3. బెంగళూరు
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
2. బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్లు గెలిచిన షట్లర్?
1. లిన్డాన్
2. శ్రీకాంత్ కిదాంబి
3. గోపీ చంద్
4. కెంటో మొమోటా
- View Answer
- సమాధానం: 4
Published date : 11 Jan 2020 06:47PM