Skip to main content

ఖేలో ఇండియా చాంపియన్‌గా పంజాబ్ వర్సిటీ

తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.
Current Affairsఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మార్చి 1న ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి.

ఈ క్రీడల్లో ఏపీకి చెందిన నాగార్జున వర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర వర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా వర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో నిలిచాయి. తెలంగాణకు చెందిన ఉస్మానియా వర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు వర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : పంజాబ్ యూనివర్సిటీ జట్టు
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
Published date : 02 Mar 2020 05:41PM

Photo Stories