క్విక్ రెస్పాన్స్ మిస్సైల్స్ పరీక్ష విజయవంతం
Sakshi Education
అన్ని రకాల పరిస్థితుల్లోనూ సమర్థంగా దాడి చేయగల క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్(క్యూఆర్‌ఎస్‌ఏఎమ్) ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) విజయవంతంగా ప్రయోగించింది.
ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 4న ఈ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టారు. ఘన ఇంధనంతో నడిచే ఈ క్విక్ రెస్పాన్స్ క్షిపణి 25-30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయోగించగల ఈ క్షిపణిలో యుద్ధ విమానాల రాడార్లకు దొరక్కుండా ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒడిశా

Published date : 05 Aug 2019 05:49PM