Skip to main content

కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం

ప్రముఖ తెలుగు కవి డా. కె. శివారెడ్డికి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే సరస్వతి సమ్మాన్-2018 పురస్కారం లభించింది.
ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’ కవితా సంపుటి ఈ అవార్డుకు ఎంపికైంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 28న జరిగిన బిర్లా ఫౌండేషన్ 28వ సరస్వతి సమ్మాన్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో శివారెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞాపికతోపాటు అవార్డు కింద ఫౌండేషన్ ఇచ్చే రూ. 15 లక్షల నగదును అందజేశారు. ప్రస్తుతం కేకే బిర్లా ఫౌండేషన్ అధ్యక్షురాలుగా శోభనా భారతీయ ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : కేకే బిర్లా ఫౌండేషన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ‘పక్కకి ఒత్తిగిలితే’ కవితా సంపుటి రచించినందుకు
Published date : 30 Sep 2019 05:45PM

Photo Stories