క్వాడ్ కూటమి దేశాధినేతల తొలి సమావేశం
Sakshi Education
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల అధినేతల తొలి సమావేశం 2021, మార్చి 12న వర్చువల్ విధానంలో జరిగింది.
సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ పీఎం యోషిహిదె సుగా పాల్గొన్నారు. వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్ 19 టీకా, నూతన సాంకేతికలు అనే ప్రపంచానికంతటికీ మంచి జరిగేందుకు ఉద్దేశించిన అంశాలను ఈ భేటీకి అజెండాగా తీసుకున్నారు. సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా శాంతి, అభివృద్ధిలను సాధించే శక్తిగా క్వాడ్ నిలుస్తుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్వాడ్ కూటమి దేశాధినేతల వర్చువల్ సమావేశం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ పీఎం యోషిహిదె సుగా
ఎందుకు : వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్ 19 టీకా, నూతన సాంకేతికలు అనే అంశాలపై చర్చించేందుకు

Published date : 13 Mar 2021 06:24PM