కృష్ణబిలం ఛాయా చిత్రం తీసిన శాస్త్రవేత్తలు
Sakshi Education
తొలిసారిగా కృష్ణబిలం ఛాయా చిత్రాన్ని శాస్త్రవేత్తలు తీశారు. ఈ ఘనతను ఫ్రాన్స్ లోని నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన పరిశోధకులు సాధించారు.
మన పాలపుంతలోని ఎం87 నక్షత్ర సమూహం (గెలాక్సీ)లో భూమికి 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కృష్ణబిలాన్ని ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ సాయంతో ఫొటో తీశారు. మధ్యలో నల్లటి ప్రాంతం, చుట్టూ నారింజ రంగులో ఉన్న మంటలు, తెల్లటి ప్లాస్మా, వాయువులు ఉన్న కృష్ణబిలం చిత్రాన్ని ఏప్రిల్ 10న శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
18వ శతాబ్దంలో కృష్ణబిలం ఉనికి గురించి తెలిసినా.. ఇప్పటివరకు అత్యంత అరుదుగా దాన్ని శాస్త్రవేత్తలు టెలిస్కోప్ సాయంతో చూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృష్ణబిలం ఛాయా చిత్రం తీసిన శాస్త్రవేత్తలు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఫ్రాన్స్ లోని నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన పరిశోధకులు

Published date : 12 Apr 2019 05:54PM