Skip to main content

కృష్ణా జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని వక్కపట్లవారిపాలెం ఓఎన్‌జీసీ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన నూతన గ్యాస్ పైప్‌లైన్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నవంబర్ 8న ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం వల్ల వినియోగదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఓఎన్‌జీసీ బావులను పరిశీలించి ఆయిల్, గ్యాస్ వెలికితీత వివరాలు తెలుసుకున్నారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు.

మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఉక్కుశాఖ ఉన్నతాధికారులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలో నవంబర్ 8న జరిగిన ఈ భేటీలో కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

మాదిరి ప్రశ్నలు
1. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఏ రాష్ట్రంలోని ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం : 3
Published date : 09 Nov 2019 05:51PM

Photo Stories