కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
Sakshi Education
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ నవంబర్ 9న ప్రారంభమైంది.
సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు’ అని తెలిపారు. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి 2019, నవంబర్ 12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు.
కర్తార్‌పూర్ కారిడార్‌కు సంబంధించిన మరిన్ని కథనాల కోసం క్రింది క్లిక్ చేయండి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : డేరాబాబా నానక్, కర్తార్‌పూర్
ఎందుకు : సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కలిపేందుకు
మాదిరిప్రశ్నలు
1. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఏ నది ఓడ్డున ఉంది?
1. జీలం నది
2. సింధు నది
3. రావి నది
4. సట్లేజ్ నది
సమాధానం : 3
2. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతిని (నవంబరు-12) పురస్కరించుకొని ఆయన స్మారక నాణేన్ని ఇటీవల ఏ దేశం విడుదల చేసింది?
1. భారత్
2. పాకిస్తాన్
3. నేపాల్
4. అమెరికా
సమాధానం : 2

Published date : 11 Nov 2019 05:51PM