Skip to main content

కరోనావాక్‌ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంస్థ?

చిన్న పిల్లలకు కూడా కరోనాసోకుతుండడంతో వారికోసం చైనా దిగ్గజ ఫార్మా సంస్థ సైనోవాక్‌ బయోటెక్‌ ‘కరోనావాక్‌’ పేరుతో కోవిడ్‌–19 టీకాను అభివృద్ధి చేసింది.
Current Affairs ఈ టీకా అత్యవసర వినియోగానికి చైనా అధికార యంత్రాంగం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని సైనోవాక్‌ చైర్మన్‌ యిన్‌ వీడోంగ్‌ జూన్ 6న వెల్లడించారు. అయితే, ఏ వయసు వారికి ఈ టీకా ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. వాస్తవానికి కరోనావాక్‌ను 3 నుంచి 17 ఏళ్లలోపు వారికి అందజేసేందుకు వీలుగా అభివృద్ధి చేశారు. పిల్లల్లో ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడయ్యింది. చైనాలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లలో ఇప్పటిదాకా ఐదు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు.

టీకా టెక్నాలజీ బదిలీకి సిద్ధం
రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వీ తయారీకి భారతీయ కంపెనీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాక్సిన్‌ టెక్నాలజీ బదిలీకి తాము సిద్ధంగా ఉన్నామని జూన్ 5న ప్రకటించారు. విదేశాల్లో కూడా టీకా ఉత్పత్తిని విస్తృతం చేస్తామన్నారు. వ్యాక్సిన్‌ టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధమైన ఏకైక దేశం రష్యాయేనని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా దిగ్గజ ఫార్మా సంస్థ సైనోవాక్‌ బయోటెక్‌ ‘కరోనావాక్‌’ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : చైనా అధికార యంత్రాంగం
ఎందుకు : చిన్న పిల్లలకు కూడా కరోనాసోకుతుండడంతో వారికోసం...
Published date : 07 Jun 2021 07:24PM

Photo Stories