Skip to main content

కరోనాపై పోరుకు రోబోటిక్‌ శుద్ధి యంత్రం

ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న రీవాక్స్‌ ఫార్మా ఓ వినూత్నమైన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Current Affairs

ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో ఉండే పడకలను కరోనా వైరస్‌ రహితంగా మార్చేందుకు యూవీ–బీఆర్ రోబోటిక్‌ శుద్ధి యంత్రాన్ని రూపొందించింది. ఈ యంత్రం బ్యాక్టీరియా/వైరస్‌లోని డీఎన్‌ఏను నాశనం చేయగల స్థాయిలో అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేస్తుంది. ఐసీయూ పడకలను శుద్ధి చేసేందుకు ప్రస్తుతం రసాయనాలను వాడుతున్నారు.


మొబైల్ ఫోన్లతో వైరస్ ముప్పు అధికం

మొబైల్‌ ఫోన్లతో కరోనా వైరస్‌ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్‌కు చెందిన ఎయిమ్స్‌ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్‌–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్‌ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ అంశంపై బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జనరల్‌లో ఒక కథనం ప్రచురితమైంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : యూవీ–బీఆర్ రోబోటిక్‌ శుద్ధి యంత్రం రూప‌క‌ల్పన‌
ఎప్పుడు : మే 15
ఎవరు : రీవాక్స్‌ ఫార్మా
ఎందుకు : ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికి
Published date : 16 May 2020 09:47PM

Photo Stories