కరోనాపై పోరుకు భారత్‌కు అమెరికా సాయం
ఇందులో భారత్‌కు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ప్రస్తుతం 64 దేశాలు కరోనా సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయని, ఈ దేశాల్లో తగినన్ని వైద్య సాధనాలు గానీ నిపుణులు గానీ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. లేబొరేటరీ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు, ఇతర అవసరాలకు భారత్‌తోపాటు ఈ దేశాలు ఆర్ధిక సహాయాన్ని వినియోగించుకోవాలని ఈ శాఖ కోరింది.
అమెరికా గ్లోబల్ ప్యాకేజీ కింద భారత్‌తో పాటు సార్క్ దేశాలైన నేపాల్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకుకూడా ఆర్థిక సాయం అందనుంది. శ్రీలంకకు 10.3 లక్షల డాలర్లు, నేపాల్‌కు 10.8 లక్షలు, బంగ్లాదేశ్‌కు 30.4 లక్షలు, అఫ్ఘానిస్థాన్‌కు 50 లక్షల డాలర్లు గ్లోబల్ ప్యాకేజీ ద్వారా అందుతాయని యూఎస్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : అమెరికా
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
ఎందుకు : కరోనాపై పోరుకు