కరోనా టీకా ఉత్సవాలను ఏ తేదీల్లో నిర్వహించనున్నారు?
Sakshi Education
దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏప్రిల్ 8న వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులను కోరారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విధిస్తున్న నైట్ కర్ఫ్యూ పేరును ‘కరోనా కర్ఫ్యూ’గా పేర్కొనాలని సూచించారు. అలాగే 2021, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలని, తద్వారా అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11 సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫులే జయంతి అని ప్రధాని గుర్తు చేశారు. టీకా ఇచ్చేందుకు నిర్ధారించిన 45 ఏళ్ల వయో పరిమితిని ప్రధాని సమర్ధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలి
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలి
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు
Published date : 09 Apr 2021 06:17PM