Skip to main content

కరోనా టీకా పంపిణీ కోసం భారత రూపొందించిన యాప్ పేరు?

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం భారత ప్రభుత్వం ‘‘కోవిన్(CoWin)’’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
Current Affairs
టీకా పంపిణీలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర ప్రభుత్వం జనవరి 10న ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్‌లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది.

జనవరి 16న...
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో జనవరి 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 10న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్‌మెంట్ టు కంబాట్ కోవిడ్-19 చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కోవిన్(CoWin) పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పన
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం
Published date : 11 Jan 2021 05:59PM

Photo Stories