కరోనా లక్షణాలతో వైరాలజిస్ట్ గీతా రామ్‌జీ మృతి
Sakshi Education
ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్, భారతీయ సంతతి శాస్త్రవేత్త గీతా రామ్‌జీ(64) దక్షిణాఫ్రికాలో ఏప్రిల్ 1న కన్నుమూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్, భారతీయ సంతతి శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : గీతా రామ్‌జీ(64)
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో
ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధక మండలి(ఎస్‌ఏమ్‌ఆర్‌సీ) అధ్యక్షురాలు, సీఈఓ గ్లెండా గ్రే ధ్రువీకరించారు. లండన్ నుంచి తిరిగివచ్చిన గీత.. కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో ఆస్పత్రిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన గీతా రామ్‌జీ దక్షిణాఫ్రికా క్లినికల్ ట్రయల్స్ విభాగం ప్రధాన విచారణాధికారి, ఎస్‌ఏఎమ్‌ఆర్‌సీ హెచ్‌ఐవీ నిరోధక పరిశోధక సంస్థ విభాగం డైరెక్టర్‌గా డర్బన్‌లో సేవలు అందించారు. హెచ్‌ఐవీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు పలు పరిశోధనలు జరిపారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ డెవలప్‌మెంట్ క్లినికల్ ట్రయల్స్ పాట్నర్‌షిప్స్ సంస్థ ఆమెకు అత్యంత ప్రతిభ గల మహిళా శాస్త్రవేత్త అవార్డును ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్, భారతీయ సంతతి శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : గీతా రామ్‌జీ(64)
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో
Published date : 02 Apr 2020 02:16PM