Skip to main content

కరోనా కాలంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ దక్షిణ కొరియాలో జరిగిన ఎన్నికల్లో గతమూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Current Affairs

కోవిడ్‌ ప్రబలిన తరువాత ప్రపంచంలో ఎన్నికలకు వెళ్ళిన తొలిదేశం దక్షిణ కొరియానే. కోవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణాచర్యల మధ్య ఓటింగ్‌ జరిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, చేతికి గ్లౌజ్‌ పెట్టుకొని ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈసారి అత్యధికంగా 66.2 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు జాతీయ ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 15న వెల్లడించింది. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో 300 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశ అధ్య‌క్షుడిగా మూన్‌ జే ఇన్ ఉన్నారు.


భారత్‌ అనుమతినిచ్చింది: మలేషియా

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను కట్టడి చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు విక్రయించేందుకు భారత్‌ అంగీకరించిందని మలేషియా మంత్రి కౌముర్దీన్‌ జాఫర్‌ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్‌ 14న మలేషియాకు 89,100 టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతినిచ్చింది. మరిన్ని టాబ్లెట్లు తెప్పించునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ లభ్యతపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’అని రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కరోనా కట్టడిలో సత్పలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్న‌ యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాల్సిందిగా మలేషియా భారత్‌ను అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌, మాల్దీవులు తదితర దేశాలకు భారత్‌ ఈ టాబ్లెట్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే.
Published date : 16 Apr 2020 06:16PM

Photo Stories