కర్ణాటక స్పీకర్‌గా విశ్వేశ్వర్ హెగ్డే
Sakshi Education
కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వేశ్వర్ హెగ్డే కగేరి జూలై 31న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ఉన్నన్నాళ్లూ స్పీకర్‌గా కొనసాగిన కేఆర్ రమేశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ బలపరిచిన కగేరికి పోటీగా కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎవరినీ బరిలో దింపకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మూజు వాణి ఓటుతో కగేరి గెలిచాక ఆయన్ను సీఎం స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూలై 31
ఎవరు : విశ్వేశ్వర్ హెగ్డే కగేరి
క్విక్ రివ్యూ :
ఏమిటి : కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూలై 31
ఎవరు : విశ్వేశ్వర్ హెగ్డే కగేరి
Published date : 01 Aug 2019 05:44PM