క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌లపై నిషేధం
Sakshi Education
టీవీ టాక్ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 11న నిషేధం విధించింది.
అయితే నిషేధం ఎంత కాలం లేదా ఎన్ని మ్యాచ్‌లు అనే విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు కూడా వీరిద్దరు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాండ్యా, రాహుల్ అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర వివాదం చెలరేగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లపై నిషేధం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
ఎందుకు : టీవీ టాక్ ‘షో’లో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు

Published date : 12 Jan 2019 06:12PM