క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన వికెట్ కీపర్?
ఈ విషయాన్ని డిసెంబర్ 9న పార్థివ్ ప్రకటించాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన 35 ఏళ్ల పార్థివ్... 2020 ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు.
25 టెస్టుల్లో, 38 వన్డేల్లో...
భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతను 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్‌లు చేశాడు. రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.
ఐపీఎల్/దేశవాళీ క్రికెట్‌లో:
- ఐపీఎల్‌లో పార్థివ్ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
- పార్థివ్ సారథ్యంలోనే గుజరాత్ మూడు ఫార్మాట్‌లలో (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం.
- భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్ చావ్లా, శివరామకృష్ణన్ తర్వాత పార్థివ్‌ది నాలుగో స్థానం. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం ప్రపంచ క్రికెట్ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్