Skip to main content

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ పేస్ బౌలర్?

పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ఆటకు వీడ్కోలు పలికాడు.
Current Affairs
ప్రస్తుతం జరుగుతున్న పాక్ దేశవాళీ టోర్నీ టి20 కప్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఉమర్... అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు అక్టోబర్ 17న ప్రకటించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టిన ఉమర్ ... 130 వన్డేల్లో 179 వికెట్లు తీశాడు. 60 అంతర్జాతీయ టి20ల్లో 36 ఏళ్ల గుల్ మరో 85 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన..
సుమారు దశాబ్దకాలం పాటు పాక్ జట్టు ప్రధాన పేసర్‌గా పలు చిరస్మరణీయ విజయాల్లో ఉమర్ భాగమయ్యాడు. అంతర్జాతీయ టి20ల్లో టాప్-10లో రెండు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (5/6, 5/6) నమోదు చేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ తరఫున తన చివరి మ్యాచ్‌ను అతను నాలుగేళ్ల క్రితం 2016లో ఆడాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్తాన్ సీనియర్ పేస్ బౌలర్
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఉమర్ గుల్
Published date : 19 Oct 2020 05:47PM

Photo Stories