Skip to main content

కోవిడ్‌పై ఉమ్మడిగా పోరాడదాం: భారత ప్రధాని

కోవిడ్-19 కట్టడికి కలసికట్టుగా పోరాటం చేద్దామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు.
Current Affairsఇందుకోసం సభ్య దేశాలు ఉమ్మడిగా బలమైన వ్యూహాన్ని రచించాలని మార్చి 13న ట్వీట్ చేశారు. ఆ ప్రణాళిక ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ ప్రతిపాదనలను శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్, నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ స్వాగతించారు.

దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి(SAARC)
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియాహుర్ రెహ్మాన్ సార్‌‌కను మొదట ప్రతిపాదించారు. ఆర్థికంగా సాంఘికంగా, సాంస్కృతిక రంగాల్లో కలిసి కట్టుగా అభివృద్ధి సాధించడానికి దక్షిణాసియాలో ఒక స్వతంత్ర సంస్థ ఉండాలని సూచిచారు. వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, ఆర్థికంగా, పేదరిక నిర్మూలన, ప్రజల మధ్య సత్సంబంధాలు, పర్యాటక రంగాలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్ వంటి దాదాపు 16 విభాగాల్లో పరస్పర సహకారం అందించుకోవడానికి భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు 1985 డిసెంబర్ 8న సార్‌‌కను ఏర్పరుచుకొన్నాయి. 2005లో అఫ్గనిస్తాన్ సభ్యత్వం తీసుకోడంతో సార్క్ సభ్యదేశాల సంఖ్య 8కి చేరింది. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది.

దక్షిణాసియ దేశాల ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచడం, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో అభివృద్ధి సాధించడ ద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో జీవన ప్రమాణం కలిగి ఉండటం కోసం సార్‌‌క కృషి చేస్తుంది.
Published date : 14 Mar 2020 05:52PM

Photo Stories