Skip to main content

కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ

కోవిడ్‌–19 చికిత్సలో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌– అజిథ్రోమైసిన్‌’(హెచ్‌సీక్యూ–ఐజీ) కాంబినేషన్‌ ఎలాంటి సానుకూల ఫలితాలు సాధించిందనే వివరాలను వెల్లడించే అధ్యయనం ఒకటి ఫ్రాన్స్‌లో తాజాగా తెరపైకి వచ్చింది.
Current Affairs

మార్సిలీలోని ఐహెచ్‌యూ, మెడిటెరేన్‌ ఇన్‌ఫెక్షన్‌ కేంద్రంలో ఈ అధ్యయనాన్ని మార్చి– ఏప్రిల్‌ మధ్య నిర్వహించారు. 1061 కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు కనీసం మూడు రోజుల పాటు ‘హెచ్‌సీక్యూ–ఐజీ’ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. వీరిలో 973(91.7%) మంది పది రోజుల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.


అధ్యయనం వివరాలు

ఈ స్టడీ వివరాలను మార్సిలీ(ఫ్రాన్స్‌)లోని ‘ఐహెచ్‌యూ, మెడిటెరేన్‌ ఇన్‌ఫెక్షన్‌’ సంస్థ వెల్లడించింది. ‘మార్చి 3– ఏప్రిల్‌ 9 మధ్య 38,617 మంది పేషెంట్ల నుంచి 59, 655 శాంపిల్స్‌ను పీసీఆర్‌ సేకరించింది. ఆ పేషెంట్లలో కరోనా పాజిటివ్‌గా తేలిన 3,185 మంది పేషెంట్లలో 1,061 మంది మా అధ్యయనానికి సరిపోయారు. వారి సగటు వయసు 43.6 ఏళ్లు. వారిలో పురుషులు 492 మంది. వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌– అజిథ్రోమైసిన్‌ కాంబినేషన్‌తో చికిత్స జరిపి, ఈ అధ్యయనాన్ని రూపొందించాం’ అని వివరించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఫ్రాన్స్‌లోని ‘ఐహెచ్‌యూ, మెడిటెరేన్‌ ఇన్‌ఫెక్షన్ సంస్థ
Published date : 11 Apr 2020 06:01PM

Photo Stories