Skip to main content

కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

కోవిడ్-19 ఆర్థికంగా దేశదేశాలను దెబ్బతీస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Current Affairsభారత్‌లో ఈ వైరస్ వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలకు ఉపశమనం కల్పించే చర్యలను చేపట్టేందుకు ‘కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్చి 19న ప్రకటించారు. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని, వివిధ రంగాలకు ప్రకటించే రిలీఫ్ ప్యాకేజ్‌లను ఇది నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఆర్థిక రంగ పునరుత్తేజానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్‌ఫోర్స్ నిర్ణయిస్తుందన్నారు.

భారత్‌లో నాలుగో మరణం
భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి మార్చి 19న కోవిడ్‌తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్‌లో గురువారానికి 173కి చేరింది. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో దిగవద్దని కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కోవిడ్-19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలకు ఉపశమనం కల్పించే చర్యలను చేపట్టేందుకు
Published date : 20 Mar 2020 05:57PM

Photo Stories