Skip to main content

కోనేరు హంపికి ఫిడే గ్రాండ్ ప్రి టైటిల్

ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ చెస్ ప్లేయర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోనేరు హంపికి ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్టోర్నీ 2019 టైటిల్ లభించింది.
రష్యాలోని స్కోల్‌కోవోలో సెప్టెంబర్ 22న ముగిసిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి అజేయంగా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆమె 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 7.5 పాయింట్లతో జు వెన్‌జున్ (చైనా) రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్‌జున్ తో జరిగిన చివరిగేమ్‌ను హంపి 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. విజేతగా నిలిచిన హంపికి 15 వేల యూరోల (రూ. 11 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 160 పాయింట్లు లభించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : కోనేరు హంపి
ఎక్కడ : స్కోల్‌కోవో, రష్యా
Published date : 24 Sep 2019 05:54PM

Photo Stories