కో-ఆపరేటివ్ బ్యాంకులు సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి..: ఆర్‌బీఐ
Sakshi Education
సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ) పరిధిలోకి రూ.500 కోట్లు, అంతకు మించి ఆస్తులు కలిగిన అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
పెద్ద రుణాల మంజూరుకు సంబంధించిన సమాచారాన్ని సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోని సంస్థలు ఆర్‌బీఐకి వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, ఆర్థిక సంస్థలు దీని పరిధిలో ఉన్నాయి. ఇటీవలి పీఎంసీ బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చింది.
Published date : 06 Dec 2019 06:21PM