Skip to main content

కనోజియాను విడుదల చేయండి: సుప్రీంకోర్టు

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ... పోలీసులు అరెస్టు చేసిన పాత్రికేయుడు ప్రశాంత్ కనోజియాను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదే సమయంలో, అలాంటి పోస్టులు ఆమోదయోగ్యం కాదని సదరు పాత్రికేయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును ప్రభుత్వాలు అడ్డుకోజాలవని, స్వేచ్ఛ హక్కు పవిత్రమైంది, చర్చకు అతీతమైందని ఈ సందర్భంగా పేర్కొంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసిన వీడియోను కనోజియా షేర్ చేయడంతో జూన్ 8న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. కనోజియాను చట్ట విరుద్ధంగా నిర్బంధించారంటూ అతని భార్య జిగిషా అరోరా పెట్టుకున్న హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగిల వెకేషన్ బెంచ్ జూన్ 11న విచారణ చేపట్టింది.
Published date : 12 Jun 2019 06:30PM

Photo Stories